బెల్ట్ షాపులపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర హెచ్చరిక

రిపోర్టర్: సునీల్ స్థలం: నల్గొండ

మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నియంత్రణపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అక్రమ మద్యం విక్రయాలు జరిగితే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించని ఎస్ఐలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెల్ట్ షాపులను కంట్రోల్ చేయకపోతే ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదంటూ రాజగోపాల్ రెడ్డి ఘాటుగా హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు.