విశాఖలో వినాయక నిమజ్జన వేళ డిజే సౌండ్ కు వ్యక్తి మృతి
రిపోర్టర్: సురేష్
స్థలం: Visakhapatnam
విశాఖపట్నం నగరంలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. జీవీఎంసీ పరిధిలోని 8వ వార్డు ఎండాడ ప్రాంతంలో వినాయక నిమజ్జన సమయంలో డిజే సౌండ్ తీవ్రత కారణంగా రెడ్డిపల్లి శంకర్రావు అనే వ్యక్తి మృతి చెందారు. డీజే హోరు వల్ల జరిగిన ఈ మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.