విజయనగరం మేయర్ పీఠంపై భారీ మెజారిటీతో అవనాపు భార్గవి జైత్రయాత్ర
రిపోర్టర్: THADI BHAVANI
స్థలం: విజయనగరం
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో విజయనగరం మేయర్ గా అవనాపు భార్గవి తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి కోలగట్ల శ్రావణిపై 18,555 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా మేయర్ గా ఎన్నికైన అవనాపు భార్గవి కి ఆర్వో ఏడుకొండలు, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి.డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు.. ఈ మేరకు అభిమానులు అంతా సంబరాలు జరుపుకుంటున్నారు.