అయోధ్య రామమందిర విరాళాల లెక్కింపులో అక్రమాలు వెలుగులోకి
రిపోర్టర్: నరేష్
స్థలం: Ayodhya
అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కీలక విషయాలను గుర్తించింది. ఆలయంలోని నగదు లెక్కింపు గది నుంచి డబ్బును అనధికారికంగా తరలించడం లేదా దాచిపెట్టినట్లు 105 ఘటనలను సిట్ తన నివేదికలో పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ నివేదికను పరిశీలించగా, ఎనిమిది మంది నిందితులను గుర్తించి దర్యాప్తును ముమ్మరం చేశారు.