హైదరాబాద్ వనస్థలిపురంలో పాల వ్యాపారి భుజంగరావు దారుణ హత్య
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ బస్ స్టాప్ సమీపంలో పాల వ్యాపారి భుజంగరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో నరికి దారుణంగా హత్య చేశారు. శుక్రవారం తెల్లవారుజామున టూవీలర్ పై వెళ్తుండగా ఈ అటాక్ జరగగా తీవ్ర రక్తస్రావంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. భూ వివాదం లేదా పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.