'అమ్మ మీ ముఖంలో చిరునవ్వు కోసమే ఈ ప్రయత్నం': రష్మిక మందన్న
రిపోర్టర్: కృష్ణ
స్థలం: చెన్నై
దిగ్గజ గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'ఎంఎస్: ఏ లెగసీ ఆన్ స్క్రీన్' చిత్రంలో నటించనుండటంపై ప్రముఖ నటి రష్మిక మందన్న స్పందించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం అనంతరం రష్మికతో పాటు నిర్మాతలు బన్నీ వాసు, రాక్ లైన్ వెంకటేష్ తదితరులు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కుటుంబాన్ని ఒక ఆలయంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రష్మిక, ఆమెను తన జీవితంలో భాగం చేసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, ఈ చిత్రంతో ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు తెప్పించడమే తన లక్ష్యమని భావోద్వేగంతో తెలిపారు.