బీసీల అభ్యున్నతికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది: డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్

రిపోర్టర్: రాము స్థలం: గుంటూరు

సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ - కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ వెల్లడించారు. గత నలభై ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీకి బీసీ వర్గాలు బలమైన మద్దతుగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాం నుంచి పలు చర్యలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు.