నల్లగొండలో శ్రీచైతన్య స్కూల్ నిర్వాకం: అర్ధాంతరంగా పరీక్ష రద్దుపై నిరసన

రిపోర్టర్: మహేష్ స్థలం: নల్లగొండ

నల్లగొండ పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాల యాజమాన్యం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని స్థానికులు తెలిపారు. స్కోర్ స్కాలర్షిప్ పరీక్ష పేరుతో ఫీజులు వసూలు చేసి, హాల్టికెట్లు జారీ చేసి, చివరి నిమిషంలో పరీక్ష రద్దు చేయడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కేంద్రానికి పిలిపించి మోసం చేశారని, బాధ్యులైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.