అక్రమ బెల్టు షాపులపై కొలనుపాక సర్పంచ్ సంచలన హెచ్చరిక
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో సర్పంచ్ బెదురబోయిన యాకమ్మ వెంకటేష్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్రమంగా బెల్టు షాపులను నిర్వహిస్తే నీటి కనెక్షన్లను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ విజేందర్ రెడ్డితో పాటు పలువురు వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.