కోనారెడ్డి చెరువు వద్ద గణపతి నిమజ్జనానికి ప్రత్యేక హెల్త్ క్యాంప్

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని కోనారెడ్డి చెరువు వద్ద జరుగుతున్న గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ మౌనిక, డాక్టర్ నేహా ఫాతిమాలు బాధ్యతలు నిర్వహిస్తూ భక్తులకు అందుబాటులో ఉంటారు. వారికి ఏఎన్ఎమ్ అనితతో పాటు ఆశా కార్యకర్తలు సహాయసహకారాలు అందిస్తున్నారు.