ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకుని సామాజిక సంస్కరణలపై దృష్టి పెట్టాలి

రిపోర్టర్: కృష్ణ స్థలం: వారణాసి

ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలికి సామాజిక సంస్కరణలు, సానుకూల మార్పులపై దృష్టి సారించాలని బీజేపీ కార్యకర్తలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వారణాసి నుంచి వాద్నగర్ వరకు సాగుతున్న సేవా యాత్రలో పాల్గొంటున్నవారితో ఆయన వర్చువల్ విధానంలో మాట్లాడారు. గత పన్నేండేళ్లలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని, దేశంలో మహిళల స్వయం సమృద్ధి గణనీయంగా పెరిగిందని మోదీ పేర్కొన్నారు.