'మా దృష్టికి రాలేదు.. మరోసారి విచారణకు ఆదేశిస్తాం': ఈడబ్ల్యూఎస్ ఉద్యోగాల వివాదంపై విద్యాశాఖ స్పందన

రిపోర్టర్: రాజేష్ స్థలం: Amaravati, Andhra Pradesh

బీసీ వ్యక్తి ఈడబ్ల్యూఎస్ కింద ఉద్యోగం పొందడంపై వచ్చిన ఆరోపణలు, ఆర్డీవో విచారణ నివేదిక తమ దృష్టికి రాలేదని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ స్పష్టం చేశారు. తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికెట్ పరిశీలించామని, దీనిపై మరోసారి సమగ్ర విచారణకు ఆదేశిస్తామని తెలిపారు.