యువత శారీరక దృఢత్వానికి ఆటలు ముఖ్యం: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
రిపోర్టర్: సునీల్
స్థలం: Kammarpally
మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలను ప్రారంభించిన సందర్భంగా బాల్కొండ శాసనసభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధునిక కాలంలో చిన్నారులు స్మార్ట్ఫోన్లకు బానిసలు కాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఎదిగేందుకు ప్రతిరోజూ క్రీడా మైదానాలకు పంపాలని తల్లిదండ్రులకు ఆయన పిలుపునిచ్చారు. చదువుతో పాటు శారీరక దృఢత్వానికి ఆటలు కూడా అత్యంత కీలకమని స్పష్టం చేశారు.