రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం
రిపోర్టర్: నరేష్
స్థలం: Jaipur
రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించిందని ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తెలిపారు. రాష్ట్రంలోని పది మున్సిపల్ కార్పొరేషన్లలో తొమ్మిది చోట్ల బీజేపీ బోర్డులను దక్కించుకుంది. మొత్తం పట్టణ స్థానిక సంస్థల్లో బీజేపీ 204 చోట్ల గెలుపొందగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 96 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి నిర్వహించిన రోడ్‌షోలు, పార్టీ శ్రేణుల సమన్వయం ఈ విజయానికి కారణమని ఆయన పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోనూ బీజేపీ బలపడిందని కమలనాథులు స్పష్టం చేశారు.