పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్‌లో భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామ్య హోదా లభించిందన్న జైశంకర్
రిపోర్టర్: మహేష్
స్థలం: న్యూయార్క్
న్యూయార్క్‌లో జరిగిన భారత్-ఎఫ్ఐపీఐసీ విదేశాంగ మంత్రుల సమావేశంలో పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్‌లో భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామ్య హోదా దక్కినట్లు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. పసిఫిక్ దేశాల అభివృద్ధికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఫిజీలో ఆసుపత్రి నిర్మాణం, సముద్ర అంబులెన్స్‌లు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.