మురసు తుపాను ప్రభావం: విజయవాడ డివిజన్ లో తొమ్మిది రైళ్లు రద్దు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విజయవాడ
మురసు తుపాను కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తుపాను ముప్పును నివారించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్ లో భాగంగా విజయవాడ డివిజన్ పరిధిలో మొత్తం తొమ్మిది రైలు సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించారు. విజయవాడ-గూడూరు, గుంటూరు-తెనాలి, తెనాలి-రేపల్లె మార్గాల్ లో నడిచే రోజువారీ రైళ్లను పూర్తిగా నిలిపివేశామని చెప్పారు. వాతావరణం సద్దుమణిగిన తర్వాత రైళ్ల పునరుద్ధరణపై సమాచారం అందిస్తామని, ప్రయాణికులు హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు.