ఒడిశాలో ఆర్నాబ్ తుఫాను బీభత్సం: ఆరుకు చేరిన మృతుల సంఖ్య
రిపోర్టర్: రమేష్
స్థలం: Kandhamal
ఒడిశాలో ఆర్నాబ్ తుఫాను బీభత్సం కారణంగా మృతుల సంఖ్య ఆరుకు చేరిందని, మరో పది మంది గల్లంతు అయ్యారని ప్రత్యేక సహాయ కమిషనర్ రాజేష్ పి.పాటిల్ ఆదివారం వెల్లడించారు. ఈ తుఫాను మరియు వరదల వల్ల రాష్ట్రంలో లక్షా పద్దెనిమిది వేల మంది ప్రభావితమయ్యారని, ఏడు వేలకు పైగా హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. గంజాం, కందమాల్ జిల్లాల్ లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.