స్వీయ రక్షణ శిక్షణ అందిస్తున్న పాండు రాజుకు ఘన సన్మానం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాడేరు
గురువుల దినోత్సవం సందర్భంగా పాడేరులో పాండు కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండు రాజును ఘనంగా సన్మానించారు. ఆయన గత 20 సంవత్సరాలుగా విద్యార్థిని, విద్యార్థులకు స్వీయ రక్షణ శిక్షణ అందిస్తూ, మోటివేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొట్టగుళ్లి సుబ్బారావు ఆధ్వర్యంలో మాజీ ఐఏఎస్ అధికారి తమర్బ బాబురావు నాయుడు, మాజీ మంత్రి మత్యారాస మాణికుమారి, టూరిజం డైరెక్టర్ కిల్లు రమేష్ నాయుడు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తన సేవలను గుర్తించినందుకు పాండు రాజు కృతజ్ఞతలు తెలిపారు.