ట్రంప్ వ్యాఖ్యలపై బాలకృష్ణ యాక్షన్ సీన్ వాడిన ఇరాన్

రిపోర్టర్: మహేష్ స్థలం: అమెరికా / ఇరాన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై చేసిన హెచ్చరికలకు ప్రతిగా జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలోని యాక్షన్ సన్నివేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఐక్యరాజ్యసమితి వేదికగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా ఇరాన్ ఈ వీడియోను ఉపయోగించగా, అది టాలీవుడ్ సినిమా అయినప్పటికీ వారు దానిని బాలీవుడ్గా పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం ఈ అంతర్జాతీయ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.