ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతిసురేఖను అభినందించిన మంత్రి నారా లోకేశ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతిసురేఖను మంత్రి నారా లోకేశ్ అభినందించినట్లు అధికారులు తెలిపారు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి దేశకీర్తిని ఇనుమడింపజేసిన ఆమె ప్రతిభను లోకేశ్ కొనియాడారు. భవిష్యత్తులో జరిగే ఒలింపిక్స్ పోటీల్లో పతకం సాధించడమే లక్ష్యంగా కష్టపడాలని సూచించారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.