తిరుమలలో ఘనంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు, శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
రిపోర్టర్: శివ
స్థలం: తిరుపతి
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకుని శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. గరుడ పటాన్ని ఎగురవేయడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా, గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. సీఎం వెంట భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణి ఉన్నారు.