ఎల్బీ నగర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అడ్డుకొన్న పోలీసులు
రిపోర్టర్: హరి
స్థలం: Saroornagar
సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న జీఓ-118 పత్రాల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రోటోకాల్ ప్రకారం హాజరుకావాల్సిన స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఎల్బీ నగర్ పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పత్రాలు పంచుతుండగా జరిగిన ఈ ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధిని అడ్డుకోవడం దారుణమని మండిపడుతున్నారు.