వైసీపీకి భారీ షాక్: జనసేనలో చేరిన గుంపాం పంచాయతీ నేతలు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గుంపాం పంచాయతీకి చెందిన పలువురు వైఎస్సార్సీపీ నాయకులు ఆ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి మరియు కోట రఘు సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు నూతనంగా చేరిన నాయకులు స్పష్టం చేశారు.