వైద్య విద్యార్థులకు తీపి కబురు: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన పీజీ సీట్లు
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
వైద్య విద్య పీజీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న ఎంబీబీఎస్ వైద్యులకు జాతీయ వైద్య కమిషన్ శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్ పై తొమ్మిది పీజీ సీట్లు కొత్తగా అందుబాటులోకి రాగా, తెలుగు రాష్ట్రాల్లోనూ గణనీయమైన పెరుగుదల నమోదైందని విశ్లేషకుడు డాక్టర్ టి. కృష్ణారెడ్డి వెల్లడించారు. తెలంగాణలో గత ఏడాది మూడు వేల ఏడు వందల ఇరవై ఒకటిగా ఉన్న సీట్ల సంఖ్య నాలుగు వేల నాలుగు వందల పదిహేడుకు చేరింది.