'మా ఊరికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు': ఉత్తర్ ప్రదేశ్లో రోడ్ల కోసం నిరసన
రిపోర్టర్: సతీష్
స్థలం: ఉత్తర్ ప్రదేశ్
ఉత్తర్ ప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లాలో రోడ్లు సరిగా లేకపోవడంతో పెళ్లి సంబంధాలు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్రాంతి, గౌరా విసేన్ గ్రామాల మధ్య దశాబ్దాలుగా రోడ్డు సరిగా నిర్మించకపోవడంతో విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై స్థానికుడు ధీరజ్ మౌర్య ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన దీక్ష చేపట్టారు. అధికారులు వెంటనే స్పందించి రెండు కిలోమీటర్ల మేర పక్కా రోడ్డు నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.