దుప్పెల్లిలో ఘనంగా గులాబీ పార్టీ గ్రామశాఖ నూతన కమిటీ ఎన్నిక

రిపోర్టర్: BALUGURI VENKHATAREDDY స్థలం: వలిగొండ

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని దుప్పెల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలేరు నియోజకవర్గ ఆత్మకూరు మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. పార్టీ బలోపేతానికి నూతన కమిటీ సభ్యులు అందరూ సైనికులా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.