అమృత్సర్ లో ఏఎస్ఐ హర్జీత్ సింగ్ హత్య కలకలం

రిపోర్టర్: రమేష్ స్థలం: అమృత్సర్

పంజాబ్ లోని అమృత్సర్ లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ హర్జీత్ సింగ్ ను దుండగులు కాల్చి చంపారు. భగతాన్ వాలా ప్రాంతంలో మోటార్ సైకిల్ పై పెట్రోలింగ్ చేస్తుండగా అజ్ఞాత వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం భగవంత్ మాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితుడి కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల తీరుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.