నాదర్గుల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఘోర ప్రమాదం: ఆర్చ్ కూలి విద్యార్థిని మృతి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ఎంవీఎస్ఈఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో డాండియా వేడుకల సమయంలో లైట్ల ఆర్చ్ కూలిన దుర్ఘటనలో విద్యార్థిని సోనా నారాయణ్ దాస్ దుర్మరణం చెందిందని, మరో పద్నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారని అధికార వర్గాలు వెల్లడించాయి.