'వేగంగా దూసుకొచ్చి బైక్‌లను ఢీకొట్టింది': కాప్రాలో కారు బీభత్సం

రిపోర్టర్: కృష్ణ స్థలం: కాప్రా

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాప్రా పరిధిలోని హెచ్‌బీ కాలనీలో బుధవారం తెల్లవారుజామున ఓ కారు తీవ్ర బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి గల్లీలో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత గల్లీలో అడ్డంగా ఇరుక్కుపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు నడిపిన అమన్‌పటేల్ (21)ను స్థానికులు గుర్తించి సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.