సైబర్ మోసాల బారిన పడుతున్న విద్యావంతులు అంటూ ఐఐటీ మద్రాస్ వెల్లడి
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
దేశంలో ఆర్థిక సైబర్ నేరాల బాధితుల్లో ఎక్కువ మంది అత్యధిక విద్యనభ్యసించిన నిపుణులే ఉంటున్నారని ఐఐటీ మద్రాస్ పరిశోధకులు వెల్లడించారు. కేవలం అజాగ్రత్త లేదా ఆర్థిక అవగాహన లోపం వల్లనే మోసపోతున్నారనే అభిప్రాయం సరికాదని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఐటీ నిపుణులు, వైద్యులు, బ్యాంకర్లు కూడా సైబర్ మోసాల బారిన పడుతున్నారని, మానసిక ఒత్తిడి సమయాల్లోనే నేరగాళ్లు వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని నిపుణులు పేర్కొన్నారు.