మర్కూక్ ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ పరిసర భూముల సర్వే తాత్కాలిక నిలిపివేత

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: సిద్దిపేట

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ పరిసరాల్లోని 325 సర్వే నంబర్ అసైన్డ్ భూముల సర్వేకు ఆదివారం సెలవుదినం కావడంతో బ్రేక్ పడింది. గత మూడు రోజులుగా బౌండరీలు మార్కింగ్ చేసిన అధికారులు, సోమవారం నుండి తిరిగి సర్వే నిర్వహించనున్నారు. ఇప్పటికే సుమారు 100 మంది రైతులకు నోటీసులు జారీ చేసి, భూముల ఆధారాలతో హాజరుకావాలని ఆదేశించారు.