పర్యావరణాన్ని పరిరక్షిస్తూ గ్రీన్ గ్రోత్ వైపు అడుగులు వేయాలని సీఎం చంద్రబాబు సూచన

రిపోర్టర్: వెంకట్ స్థలం: బెంగళూరు

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో నిర్మించిన ది ఎర్త్ సెంటర్‌ను కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంక్రీట్ జంగిల్స్ నుంచి పర్యావరణ హిత నిర్మాణాల వైపు దృష్టి సారించాలని, గ్రే గ్రోత్ నుంచి గ్రీన్ గ్రోత్ వైపు అడుగులు వేయాలని సూచించారు. వాతావరణ మార్పుల దుష్పరిణామాలు ఇప్పటికే మన ముందున్న సవాల్ అని, భవన నిర్మాణాల్లో నెట్ జీరో విధానాన్ని అవలంబించాలని స్పష్టం చేశారు.