'గ్రామీణ ప్రజలకు పోలీస్ శాఖ మరింత చేరువ': జిల్లాలో ఘనంగా పల్లె నిద్ర కార్యక్రమం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Andhra Pradesh

గ్రామీణ ప్రాంత ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం, శాంతిభద్రతలను పర్యవేక్షించడం మరియు నేరాల నియంత్రణే లక్ష్యంగా జిల్లాలోని పలు సబ్ డివిజన్లలో ఎస్ఐ, సీఐ స్థాయి పోలీస్ అధికారులు 'పల్లె నిద్ర' (నైట్ హాల్ట్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, వారిలో భద్రతాభావం కల్పించే దిశగా అధికారులు అడుగులు వేశారు.