చిట్వేలిలో ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల పరిశీలన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: చిట్వేలి

చిట్వేలి గ్రామపంచాయతీలో ముసాయిదా ఓటర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధ్రువీకరణల విషయంలో ప్రజలు, నాయకులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను శనివారం గ్రామసభలో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.

గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో కె.శ్రీనివాసులు మరియు అభివృద్ధి అధికారి పి.రమణయ్య ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ సాగింది. ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దేందుకు వచ్చిన విన్నపాలను అధికారులు స్వీకరించి, నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.