చెన్నూరులో వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన స్థలాన్ని సొంత ఖర్చులతో చదును చేయించిన కౌన్సిలర్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చెన్నూర్
చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు అంబేద్కర్ ఎస్సీ కాలనీలో రాబోయే వినాయక చతుర్థి పండుగ సందర్భంగా స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు కౌన్సిలర్ కొప్పుల ప్రభాకర్ తన సొంత ఖర్చులతో బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో బుధవారం విగ్రహ ప్రతిష్ఠాపన వేదిక మరియు అన్నదానం కోసం స్థలాన్ని చదును చేయించారు. అదేవిధంగా చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి స్థలాన్ని శుభ్రపరిచారు. ఈ సేవా కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు కౌన్సిలర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.