తిరుమలలో అత్యంత వైభవంగా జరిగిన పౌర్ణమి గరుడసేవ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తిరుమల
తిరుమలలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారని పేర్కొన్నారు. 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందని వెల్లడించారు. జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నారని అధికారులు స్పష్టం చేశారు.