జగన్ హయాంలో అవినీతి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశం

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన సహజ వనరుల దోపిడీ, అవినీతి ఆరోపణలపై మాజీ సీఎం జగన్పై సిట్ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే కొన్ని అంశాలపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, దర్యాప్తు జరుగుతోందని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. స్పందించిన ధర్మాసనం పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.