తెలంగాణలో బంగాళాఖాతపు వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాల హెచ్చరిక
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధ, గురువారాల్లో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలడవద్దని హెచ్చరించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.