పత్తి పొలంలో గుట్టుగా గంజాయి సాగు చేస్తున్న తండ్రీకొడుకుల అరెస్ట్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జైనూర్

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ పరిధిలో పత్తి పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న అంబురే పుండలిక్, అతని కుమారుడు అంబురే రమేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి పొలంలో సాగు చేస్తున్న 1,245 గంజాయి మొక్కలతో పాటు 11 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి సాగుకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నితికా పంత్ హెచ్చరించారు.