దివిస్ నిధులతో బస్సు సౌకర్యం కల్పించాలి.. ఉపాధ్యాయుల విజ్ఞప్తి
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థుల కోసం దివిస్ ల్యాబొరేటరీస్ సీఎస్ఆర్ నిధులతో ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని ఉపాధ్యాయులు కోరారు. ఈ మేరకు దివిస్ చైర్మన్ మురళికి వారు వినతిపత్రం అందజేసి చర్చించారు.
బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తే పాఠశాలలో విద్యార్థుల హాజరుశాతం గణనీయంగా పెరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యా వాలంటీర్లకు గౌరవ వేతనాలు అందించేందుకు కూడా సంస్థ సహకరించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.