కేవలం ఐదు వేల రూపాయలతో ఏఐ రోబో తయారు చేసిన సోదరులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: హుగ్లీ

సాంకేతిక పరిజ్ఞానం కోసం భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని బంగాల్ కు చెందిన ఇద్దరు సోదరులు నిరూపించారు. హుగ్లీ జిల్లాకు చెందిన కృష్ణకాంత, మధుసూదన్ లు కేవలం ఐదు వేల రూపాయల వ్యయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోను తయారు చేశారు. లూకా పేరుతో రూపొందించిన ఈ రోబో మాట్లాడటంతో పాటు మనుషులతో కరచాలనం చేయగలదని వారు తెలిపారు. దుర్గా పూజ వేడుకల్ లో ప్రదర్శించిన ఈ వినూత్న ఆవిష్కరణ స్థానికులను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని రూపకర్తలు పేర్కొన్నారు.