22ఏ పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదోపిడీ: కేటీఆర్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: న్యూఢిల్లీ
తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భూదోపిడీకి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చి కమీషన్లు దండుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. భూయజమానులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర జ్యుడీషియల్ విచారణ జరపాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.