భారీ ఊరట: సౌదీ అరేబియాలో శ్రీలంక యువ ఇంజినీర్ మరణశిక్ష రద్దు

రిపోర్టర్: సునీల్ స్థలం: Saudi Arabia

సౌదీ అరేబియాలో సోషల్ మీడియా పోస్ట్ వివాదం కారణంగా ఉరిశిక్ష ఎదుర్కొంటున్న శ్రీలంకకు చెందిన ఇరవై నాలుగు ఏళ్ల తమిళ యువ ఇంజినీర్ అనోజన్ శివరాసా మరణశిక్షను సౌదీ అరేబియా సుప్రీంకోర్టు పూర్తిగా రద్దు చేసినట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి అధికారికంగా వెల్లడించారు. ఈ నిర్ణయంతో యువకుడి కుటుంబ సభ్యులకు పెను ఊరట లభించిందని మానవ హక్కుల సంఘాలు తెలిపాయి.