కడెం సాగునీటి కోసం పోరుబాట పట్టి గర్జించిన రైతాంగం
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
కడెం ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని వరి పంటలకు చివరి వరకు సాగునీరు అందించాలని జన్నారం మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు జాడి గంగాధర్ డిమాండ్ చేశారు. పంటలు పొట్ట దశలో ఉండటంతో నీరందక ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తిమ్మాపూర్ రాంపూర్ ఎక్స్ రోడ్డు పై రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఆయన ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీటిని విడుదల చేయాలని కోరారు.