రైల్వేకోడూరులో టీడీపీ కార్యాలయంలో ఘనంగా ప్రజా దర్బార్ నిర్వహణ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రైల్వే కోడూరు
రైల్వే కోడూరు రాఘవ రాజుపురంలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణ పరిష్కారం కోసం అధికారులతో ఫోన్లో మాట్లాడారు. మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ఆరా తీశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.