తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో అక్టోబర్ పదకొండు నుండి పదిహేడు వరకు టెన్త్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు అక్టోబర్ రెండువేల ఇరవై ఆరు పరీక్షల హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు తమ పేరు, జిల్లా వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.