నెల్లూరులో విద్యా సంస్థలను ప్రారంభించిన మంత్రి లోకేష్
రిపోర్టర్: sujith reddy
స్థలం: నెల్లూరు అర్బన్
నెల్లూరు పట్టణంలోని స్టోన్‌హౌస్‌పేటలో ఆర్ఎస్ఆర్ హైస్కూల్‌ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా ప్రారంభించారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ములాపేట, శాంతినగర్‌లోని పునరుద్ధరించిన డీఎస్ఆర్ స్కూల్‌ను ప్రారంభించేందుకు మంత్రి బయలుదేరారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని విద్యాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నెల్లూరు జిల్లాలో విద్యా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.