ప్రజావాణికి స్పందన.. సమస్యలు పరిష్కరిస్తాం: ఎంపీడీవో ఉమర్ షరీఫ్

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో ఉమర్ షరీఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలు గ్రామాల నుంచి ప్రజలు భారీగా హాజరై తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు.

ప్రజలు అందించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.