బీసీ హాస్టళ్లలో విద్యార్థుల సంరక్షణకు 222 మంది కేర్‌ టేకర్ల నియామకం

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

రాష్ట్రంలోని బీసీ వసతి గృహాల్లో విద్యార్థుల సంరక్షణ కోసం ప్రభుత్వం 222 మంది కేర్‌ టేకర్లను నియమించనుంది. మహిళా పోలీసులు, వీఆర్‌ఏలను ఈ విధుల్లోకి తీసుకోనున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముగిసిన వెంటనే వీరు విధుల్లో చేరతారు. సుమారు 400 హాస్టళ్లలో వార్డెన్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, పారిశుద్ధ్యం అందించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.