వైజాగ్ భూ కబ్జాలపై విచారణ జరిపించాలంటూ తెదేపా డిమాండ్
రిపోర్టర్: అశోక్
స్థలం: విశాఖపట్నం
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో జగన్ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో వైకాపా నేతలు సాగించిన భూ కబ్జాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అప్పట్లో నగరాభివృద్ధిని పూర్తిగా విస్మరించి కేవలం అక్రమ ఆక్రమణలకే పాలకులు పెద్దపీట వేశారని దుయ్యబట్టారు. లులు మరియు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి ప్రముఖ కంపెనీలు విశాఖ నుంచి వెళ్లిపోవడానికి నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనుసరించిన కక్షసాధింపు విధానాలు, వైఖరే ప్రధాన కారణమని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.